Thursday, October 1, 2009

జనం కోసం జగన్

జగన్ని ముఖ్యమంత్రి చేయాలని హోరెత్తిన ప్రచారం
ధనం మీడియాతో కలిసి చేస్తోంది రహస్య వ్యభిచారం
సతీసహగమనం అలనాటి దురాచారం
రాజకీయ వారసత్వం అనాదిగా మన గ్రహచారం

అంతరిక్షంలోకి పంపగలిగాం రాకెట్టు
కాని ప్రజాస్వామ్యం వేస్తోంది ఇంకా పరికిణి జాకెట్టు
ఈ సానుభూతి రాజకీయం ఒక కనికట్టు
సోదరా, పెట్టకు రాష్ట్ర భవితను తాకట్టు