Wednesday, December 12, 2007

జ్ఞానజ్యోతి వెలిగే చోటు

జ్ఞానజ్యోతి వెలిగే చోటు
చీకటిని తరిమీ కొట్టు
చీకటి అంటే అజ్ఞానం
అణిగి ఉన్న అరాచకం

జ్ఞానజ్యోతి వెలిగే చోటు
చీకటిని తరిమీ కొట్టు

ఈచీకటిలోన భయము
చేయునులే కాపురము
భయంలోంచి పుట్టును ద్వేషము
మనలో పెంచును రాక్షసము
భయంలోంచి పుట్టును ద్వేషము
అది మనలో పెంచును రాక్షసము

జ్ఞానజ్యోతి వెలిగే చోటు
చీకటిని తరిమీ కొట్టు
వెలుగంటే చక్కని ఆలోచన
మనలో పెంచును అవగాహన
వెలుగంటే చక్కని ఆలోచన
అది మనలో పెంచును అవగాహన

వెలుగంటే జ్ఞానోదయము
ప్రేమతో నిండును నీహృదయము
వెలుగంటే జ్ఞానోదయము
ప్రేమతో నిండును మన హృదయము

జ్ఞానజ్యోతి వెలగాలంటే
ఈచీకటి తొలగాలంటే
చదువు చూపును మార్గము
చదువు చూపును మార్గము

చదువు ఇచ్చును చైతన్యం
తీర్చిదిద్దును మన భవితవ్యం
జ్ఞానజ్యోతిని వెలిగించుదాము
శాంతిసుమాలే పంచుదాము

జ్ఞానజ్యోతిని వెలిగించుదాము
శాంతిసుమాలే పంచుదాము

No comments: