Wednesday, March 3, 2010

కల్కి

జాతినుద్ధరించటకు ఓ కల్కి
నీతివాక్యములెన్నో పల్కి
నిజము తెలుప మీడియా కెలికి
జనులు పడిరి ఉలికి ఉలికి

భక్తి ముసుగులో వ్యాపారం
వెకిలి చేష్టల వ్యవహారం
నకిలీ స్వాముల బండారం
కనులు తెరవాలి ఇకనైనా అందరం

4 comments:

Anonymous said...

Super...Keep it up....

Nrahamthulla said...

స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

Prasad Samantapudi said...

రహంతుల్లా గారూ,
చాలా బాగా చెప్పారు.
గృహమే ఒక దేవాలయం. జీవితం నుండి పారిపోకుండా సంసార సాగరాన్ని ఈదడమే ఒక పెద్ద యోగం. ఎందరో తమ నిరాడంబరమైన గృహజీవితాలతో ఆధ్యాత్మికతని అలవర్చుకున్నారు.
టీవీ వాళ్ళు ఇప్పట్లో మారతారని నేను ఆశపడట్లేదు. మారాల్సింది మనమే; మనకోసం, మన పిల్లల కోసం.

Nrahamthulla said...

పార్కుల్లో ప్రేమికులను పట్టుకొని పెళ్ళిళ్ళు చేసేబృందాలు ఈ కామ స్వాములమీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది.