Monday, September 28, 2009

త్యాగమూర్తి సోనియా

త్యాగమూర్తట మన సోనియా
ఎప్పటకి తగ్గునో ఈ మేనియా!
ఎవరకి దక్కేను అంత భోగం?
ఇంతకి ఏమిటీ ఆవిడ చేసిన త్యాగం?!

రాజీవుని ప్రేమించెను
ఇందిరనే మురిపించెను
ఖత్రోచిని కరుణించెను
అసమ్మతిని మట్టి కరిపించెను

తీసుకునెనులే మన పౌరసత్వం
తెలియనిదా దాని వెనుక అసలు తత్వం!
పాలించమని సాష్టాంగపడుతున్న నపుంసకత్వం
ఎన్నాళ్ళో ఈ బానిస మనస్తత్వం?!

ఇచ్చేయండి త్వరగా భారత రత్నం
క్యూలోనే ఉన్నాడులే పుత్ర రత్నం
ఒక్కడైనా చేయునా ఎదిరించే ప్రయత్నం?
ఒక్కడైనా చేయునా ఎదిరించే ప్రయత్నం!

6 comments:

Anonymous said...

extraordinary.
very nice
............. vijaya

శ్రీ said...

చాలా బాగా రాసారు.

హై కమాండ్ పేరుతో తోలు బొమ్మలాట ఆడుతున్నారు రాష్ట్రంతో. ఈ ముసలి నాయకులు కూడా నపుంసకులుగా హై కమాండ్ చుట్టూ తోకలూపుతూ తిరగడం నిజంగా బాధాకరం.

కొత్త పాళీ said...

బాగుండండీ :)

Prasad Samantapudi said...

విజయ, శ్రీ, కొత్తపాళీ గారు
ధన్యవాదాలు
-ప్రసాద్

Rohini said...

chaalaa baagundhi

Prasad Samantapudi said...

రోహిణి గారు,
ధన్యవాదాలు
-ప్రసాద్