అమెరికాలో మన తెలుగు ముత్యాలు
పెంచుకోవడానికి కాస్త జీతభత్యాలు
ఎప్పుడైనా పలికినా కొన్ని అసత్యాలు
ఆఫీసు పనులే వారికి ప్రధాన కృత్యాలు
ఓపిగ్గా భరిస్తూనే బాసుల పైత్యాలు
చలాగ్గా సాధిస్తారు పనిలో ఆధిపత్యాలు
Thursday, March 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఆశువుగా కవితలు చెప్పగలగడము మరియు వ్రాయగలగడము పూర్వ జన్మ సుకృతము. మీ పరిశీలనా దృష్టికి జోహార్లు. మీ భావ ప్రకటనము సులభమైన పదములలో అమిరి సువర్ణ పుష్పానికి సువాసనలు అద్దినట్లుగా ఉన్నది. మీ కవితాఝరి నిరంతరమూ నిత్య నూతనముగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను
ఇట్లు
మీ అభిమాన పరమాణువు
రామ ప్రసాదు
వెంకట ప్రసాదుకి,
మన అనుభూతుల్ని,ఆలోచనల్ని... నాలుగు పదాలతో కవితలు ఆల్లడం, నలుగురు స్నేహితులతో పంచుకోవడం భలే ఉంటుంది.ఎప్పుడైన మీలాంటి కవితా ప్రియులిచ్చే ప్రశంసలు మరింత ప్రోత్సాహన్నిస్తాయి.
హృదయపూర్వక ధన్యవాదాలు.
-ప్రసాద్
బాగుందండీ మీ ఆశు కవిత్వం. :-)
భావన గారు, ఓ దోసెడు ధాంక్స్.
Post a Comment