రోజూ వాడొక పెగ్గేసుకుని
తల తెగ్గోసుకుంటానంటాడు
తలలు తెగుతూనే ఉన్నాయి
వాడు వాగుతూనే ఉన్నాడు
ఓ తమ్ముడు ఉరేసుకున్నాడు
మరో మిత్రుడి జాడలేదు
మనోళ్ళంతా చీల్చబడ్డారు
మనలో కొందరు కాల్చబడ్డారు
శవాల్ని కావిలించుకుని
వాగుతూనే ఉన్నాడు
రోజూ వాడొక పెగ్గేసుకుని
తల తెగ్గోసుకుంటానంటాడు
Wednesday, March 10, 2010
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
అయితేనెం వాడే మాకు నాయకుడంటారు
ఇంతకాలాని తెలంగాణా భూతాన్ని వెలికితీశాడంటారు
నీ కొడుకుపై పెట్రోల్ పోసి ఉస్మానియా ముందు
ఎందుకు నిలబెట్టవ్ బే అని అడగలేమంటారు
ప్రజల యోగ క్షేమాలు గ్రహించి ఉద్యమాలు నడిపించలేని వాడు నాయకుడు కాలేడు. తన మాటను నెగ్గించుకోవడానికి ప్రజల ధన, మాన ప్రాణాలు కోరే వాడికి, ముఠా కక్షల ద్వారా ఆధిపత్యాన్ని సాధించాలనే వాడికి మనుగడ ఉండదు. అట్లు పొందే ఫలితాలన్నీ తాత్కాలికమే. నాయకులనుకోనే వారి ధోరణి మారనప్పుడు ప్రజలే మారాలి, ప్రజల పంథా మారాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యము అవుతుంది.
Post a Comment