వెర్రిగా ప్రేమించేది వాణ్ణే
దోబూచులాడే ఆ సూరీణ్ణే
రగిలితే వాడిలో కామం
కరిగి నీరవుతుంది హిమం
శిఖలో రంగురంగుల ఆకులు
రవికలో పూవుల బాకులు
వసంతమొక నెరజాణ
మీటును హృదయవీణ
గాయాలకు తేనె పూసుకుని
గేయాలను పదును పెట్టుకుని
పాత ప్రేమికుల కొత్త ప్రమాణాలు
విరామంలేని ధీర్ఘ చుంబనాలు
తొలిప్రేమలో దాటలేని ఆ హద్దులు
మోహంలో తీరును పాత పద్దులు
కుట్రలు ఎన్నో చేయును ప్రకృతి
ప్రేమతో నిండును ఈ జగతి
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
సెబాసు .. మిషిగన్ వసంతపు సొగసుని, లేదా వసంతంలో మిషిగన్ సొగసుని .. బాగా పట్టుకున్నారు
కొత్తపాళీ గారు,
ధన్యవాదాలు.
మిషిగన్ లో వసంతం మరీ వగలు పోతోంది. :-)
Post a Comment