నీవైన కొన్ని అనుభవాలను
నలుగురితోనూ పంచుకోవాలని
బ్లాగిన ఒకట్రొండు పేజీల రాతలకి
వావ్! కేజీలలో కామెంట్ల వాతలు
విదేశీ సీమలో,స్వదేశీ భాషలో
నువ్వేదో ఉగ్గూ,ఉంగా అని రాస్తే
వాడేమో వస్తువు,శిల్పం అని సణుగుతూ
అనుభూతిలేదు రచనలో పో,అంటాడు
చరుచుకుంటూ తమ జబ్బలు
విమర్శకులు పెట్టుకునే పెడబొబ్బలు
బ్లాగ్లోకంలో నువ్వూహించని ఫన్
నవ్వి నవ్వి నీ కడుపు నొప్పెట్టున్
భావవ్యక్తీకరణ నీ జన్మహక్కు
బ్లాగే అవకాశమే ఒక పెద్దలక్కు
రాయడం ఎన్నడూ మరువకోయి
ఉందిలే అందులో కొంత హాయి
Thursday, May 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బ్లాగు బ్ల్లాగు! :)
superb superb !
బహు బ్లాగు:))
కామెంటిన బ్లాగ్మిత్రులకు బ్లాగాభివందనాలు! :-)
భలే!
Post a Comment