మిత్రులకి కొన్ని సరదా పద్యాలు
పదాల నైవేద్యాలు
తీయవద్దు నానార్ధాలు
నొప్పిస్తే క్షమాపణలు
* * *
హరి:
సిపియం టీంలో అతనొక బెబ్బులి
మిత్రులకు అతనొక మిఠాయి కిళ్ళి
ప్రియురాలికి చల్లని జాబిల్లి
అందరివాడు మన శికాకొల్లి
భాగవథుల:
చేపల పులుసంటే అతనికి అలుసు
అతనికిష్టం మద్యం ఓ గ్లాసు, సినీతారల ఊసు
పనిలో భక్తరామదాసు
మన భాగవథుల శ్రీనివాసు
సుధా:
అతడున్న చోట ఎంతో హడావిడి, కాస్త మందు తడి
బూతుపాటల జడి, నాన్ స్టాప్ కామెడి
మాటలు చాలా వాడి, మనసు బంగినిపల్లి మామిడి
అతనే మన సుధా పమిడి
సుధీర్:
మితభాషి, లోలోన ఏదో తాత్విక చింతన
ఆప్యాయత గుభాళించును అతని చెంతన
మనసులకి వేస్తాడు స్నేహంతో వంతెన
వినయశీలి, మన సుధీర్ మంతెన
బసు:
సముద్ర ప్రయాణంలో కంపాసు
వానాకాలంలో బొమ్మిడాల పులుసు
హాస్పిటల్ లో అందమైన నర్సు
పార్టీలలో మన బసు, ఇదే నా సిఫార్సు
జానా:
ఆట పాటలకి రెడీ ఎప్పుడైనా
శ్రీమతికి చెప్పాలి కధ ఏదైనా
రెండు పెగ్గులు వేస్తే తానా తందానా
సరదాలకి చిరునామా, మన మెట్ల జానా
వెంకట:
పాదరసం కంటే చురుకైన వాడు, అకట!
ఈమధ్య నీరసంగా ఉంటున్నాడు, ఎందుకట?
పాపం, ముద్దుముచ్చట్లకు పస్తులట
కాస్త ఓపిక పట్టు, ఫణీంద్ర వెంకట!
ఇంతెకాబ్:
ఆన్ లైన్లో స్టాకుల వేలం
ట్రేడింగ్ లో తెలియదు కాలం
మనీ ఆటలో మహేంద్రజాలం
మన ఇంతెకాబ్ ఆలం
Thursday, July 5, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment