అమెరికాలో నువ్ కాల్పెట్టిన
అలనాటి నుండి నేటిదాకా
'డీల్స్' అంటూ వేలం వెర్రిగా
మాల్స్ చుట్టూ పరుగులెడుతూ
కొనితెచ్చిన ఆచెత్త నంతన్
ఇంటినిండా కొలువు పెట్టినా
ఇంకేదో కొన్లేదని,కలతచెందుతూ
భర్తేదో అన్నాడని,కన్నీరొలుకుతూ
సాతానుకి ఆత్మను తాకట్టు పెట్టిన
పాతకధలోని రాకుమారి వలే,
ఈ వినియోగ మాయా ప్రయోగశాలలో
వస్తువ్యామోహంలో పడికొట్టుకుంటూ
నాడు కాలేజీరోజుల్లో మేరీజీలపై
నువ్వు దంచిన ఉపన్యాసాలు,
భావి జీవితంపై రాసిన వ్యాసాలు
ఇస్టులతో చేసిన సాహితీ గోష్టులు...
ఆపాతజీవితపు ఆకస్మిక జ్ణాపకాలలో
నీరూపాన్ని నువ్వే పోల్చుకోలేక
నీ గమనమెటో తేల్చుకోలేక
నువ్వు పడుతున్న నరకయాతన
నీలో రాబోయే మార్పుకి చిన్నసూచన
Monday, May 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Superb Sir !! Wonderful observation !!!
ఇదేదో సున్నితమయిన విషయం లాగుంది.
నో కామెంట్స్!
@RamaPrasad, Thanks!
@శ్రీ, మీ ప్రశంసలతో పాటుగా,విమర్శలు కూడా విలువైనవే. విమర్శకు ఎన్నడూ వెనుకాడవద్దు.
Excellent!!
Post a Comment