Sunday, October 4, 2009

ఆంధ్రులు - సరదా పద్యాలు

ప్రదేశాలు ఎన్ని మారినా
ఉద్దేశాలు ఇంచుమించుగా ఒకటే
మన ఆంధ్రులు ఎప్పుడూ మెచ్చేది
పప్పన్నం విత్ ఆవకాయ పచ్చడే

రోజులో ఒక్కసారైన వినాలి పితూరి
లేదంటే ఆగిపోదా మన ఊపిరి?
చీమకైన తలపెట్టగలమా హాని,
అంటూనే చేసేయగలం గాసిప్స్ తో ఖూని

మొదటి పలకరింపుకి భలే నామోషి
చనువొచ్చాకా మొదలెడతాం అజమాయిషి
అడక్కుండానే కేటాయిస్తాం మన సమయం
ఉడుక్కుంటూనే చేసేస్తాం బోలెడు సాయం

గుంపులో గోవిందం మనకెంతో ఇష్టం
కలవనివాడి బ్రతుకు చేసేస్తాం బహుకష్టం
వదులుకోలేం కొన్ని బలహీనతలు ఎంతమాత్రం
కొద్ది పరిచయంతోనే అడిగేస్తాం కులం గోత్రం

2 comments:

Anonymous said...

Last 2 verses are really good. :)

శ్రీ said...

అన్నిటినీ కవర్ చేసి బాగా రాసారు.