మరో పనివారం మొదలయింది.
నీ తొలి అపాయింటుమెంట్ కి రిటైర్మెంట్ కి మధ్య ఎన్నో వారమో!
నువ్వు కన్న కలలకి, వాస్తవానికి మధ్య ఎంత అగాధమో!
హోదాల బురదలో కూరుకుపోయిన వ్యక్తిత్వాన్ని
ఆర్ధికావసరాల వరదలో కొట్టుకు పోయిన ఆదర్శాలని
వెతుక్కుంటున్నానుకునే కపటత్వాన్ని ఆపి
త్వరగా మాస్క్ తగిలించుకో.
అదే వేదిక. అదే పాత నాటకం. రక్తి కట్టించు.
అవే గాయాలు. అదే వంచన.
నువ్వు కోరుకున్న సలపరం. అలవాటైన వెలపరం.
అతిగా ఆలోచించకు. ఏదో ఒకటి చేసేయ్, క్విక్.
యంత్రంలా పని చేయ్, పనిలేనపుడు గాలి కబుర్లాడు.
చెప్పాలనుకున్న ఒక్క మంచి మాటా, చిల్లర విషయాల
రణధ్వనిలో కొట్టుకుపోయిందని కలత చెందుతూ...
ఏ భావాల పట్ల సిగ్గుపడుతుంటావో, వాటికే
నిన్ను అభినందిస్తోంటే ఖండించలేని నీ నిస్సహయతతో...
మరో పనివారం మొదలయింది.
Sunday, October 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బాగుంది కవిత.
పని వారం వరదలో మన వ్యక్తిత్వాలు,ఆదర్శాలు ఎలా తాకట్టు పెడతామన్న విషయం చాలా బాగా చెప్పారు.
Post a Comment