Saturday, October 24, 2009

అభాగ్యులు

ఆశయాలంటూ ఒకడు అడివికి వెళితే
అవకాశాలంటూ మరొకడు విదేశం పోయెను
ఆదర్శాల కొలిమిలో కాలుతుండెనొకడు
అవసరాల చెలిమిలో నలుగుతుండె మరొకడు

ఒకడు ఎన్నటికి ఇంటికి రాలేడు
మరొకడు ఎందుకనో స్వదేశం పోలేడు
అమ్మానాన్నలు ఆశ్రమంలో అనాధలయ్యారు
వృద్ధాప్యంలో ఒంటరి అభాగ్యులయ్యారు

ఒకడు ఆత్మవంచనలో మునిగెను నిత్యం
మరొకని ఆత్మయే మరచెను సత్యం
కన్నవారిపై ఆదరణలేని ఈ నాయాళ్ళూ
కారా ఎన్నటికీ ముసలాళ్ళు?

ఒకడికి ఈ వ్యవస్ధ పై అర్ధంలేని కోపం
మరొకడి అవగాహనలోనే ఉంది ఏదో లోపం
తల్లిదండ్రులుండీ అనాధలయ్యారు
వారిని సేవించుకోలేని అభాగ్యులయ్యారు

No comments: